తెనాలిలో సందడి చేసిన చిరంజీవి కుమార్తె సుస్మిత దంపతులు!

  • తెనాలిలో స్నేహితురాలి ఇంటికి వచ్చిన సుస్మిత
  • లక్ష బొమ్మల కొలువుకు ప్రత్యేక అతిథి
  • స్వాగతం పలికిన మెగా అభిమానులు
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, ఆమె భర్త విష్ణు తెనాలిలో పర్యటించారు. ఇక్కడి గాయత్రి సేవా హృదయం వృద్ధాశ్రమంలో సంక్రాంతి సందర్భంగా లక్ష బొమ్మల కొలువును నిర్వహించగా, తన స్నేహితురాలి ఇంటికి వచ్చిన సుస్మిత, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలసి వచ్చి బొమ్మల కొలువును తిలకించారు.

ఆమెను చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిని చూపారు. బొమ్మల కొలువు అద్భుతంగా ఉందని చెప్పిన సుస్మిత, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. దుగ్గిరాల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, చిరంజీవి అభిమాన సంఘం నేత చందు సాయిబాబు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.
Go Back to Shorts
Chiranjeevi
Susmita
Vishnu
Tenali

More Telugu News